యువనటుడు సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్నారు. రంజిత్ జయకోడి డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా యొక్క టీజర్ రీసెంట్గానే రిలీజై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట.
ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.