బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అలనాటి అందాల తార, లేట్ లెజెండరీ నటి శ్రీదేవి, బోనీ కపూర్ల గారాల పట్టి అని తెలుసు కదా. హిందీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ భామ రీసెంట్గా సౌత్ పై కన్నేసింది. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలనుందని ఇప్పటికే చాలాసార్లు మీడియా సుముఖంగా తెలిపింది.
లేటెస్ట్ గా జాన్వీ మరొక సౌత్ హీరోతో కూడా నటించాలనుందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నట్టు జాన్వీ పేర్కొంది.
జాన్వీ రీసెంట్ ఫిలిం మిలి నవంబర్ 4న విడుదలై మంచి రివ్యూలను అందుకుంటుంది.