బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2వ తేదీన "పఠాన్" టీజర్ విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదలైన పఠాన్ టీజర్ కు అన్ని చోట్లా చాలామంచి స్పందన వచ్చింది.
లేటెస్ట్ గా పఠాన్ టీజర్ ను ఒక హాలీవుడ్ మూవీ షో టైం లో ప్రదర్శించబోతున్నారట. నవంబర్ 11వ తేదీన ఇండియాలో విడుదల కాబోతున్న ప్రెస్టీజియస్ హాలీవుడ్ మూవీ "బ్లాక్ పాంథర్ : వాకండా ఫరెవర్" కి పఠాన్ టీజర్ ను అటాచ్ చేసి థియేటర్లలో ప్రదర్శించనున్నారట.
సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు. పోతే, ఈ సినిమా 25 జనవరి, 2023లో హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.