ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా ..??

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 11:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న మూడవ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా అప్డేట్లపై ఫ్యాన్స్ కుతూహలంగా ఉన్నారు. ఈ మేరకు ఒక న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది.


సూపర్ స్టార్ తల్లి ఇందిరా దేవిగారు ఆకస్మిక మరణం చెందడంతో కాస్త వెనక్కి జరిగిన ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ నవంబర్ ఆఖరి వారంలో స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ వరకు ఈ షెడ్యూల్ ను రన్ చేసి, మేజర్ పార్ట్ ను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.


పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com