సుడిగాలి సుధీర్ తో తనకున్న బంధంపై రష్మి స్పందించారు. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలైన సందర్భంగా నందు, రష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రష్మీ మాట్లాడుతూ తమ మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చని, అది ఏంటో అందరికీ వివరించలేనని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందని అన్నారు. మేం అనుకొని ఇదంతా చేయలేదని, ఓ మ్యాజిక్ లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించిందని రష్మీ తెలిపారు.