ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా, హంగూ ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా. ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ఈ రోజు నుండి ఈ మూవీ షూట్ లో పాల్గొనబోతున్నారట. మారుతీ డైరెక్షన్లో హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యోగిబాబు తో కలిసి ప్రేక్షకులను నవ్వించి, భయపెట్టడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. మరి, ఈ ఇద్దరి కాంబో కామెడీ సీన్లు ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తాయో చూడాలి.
కోలీవుడ్ నటి మాళవికా మోహనన్ ఫిమేల్ లీడ్ లో నటిస్తుందని అంటున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రభాస్ సినిమాకు పని చెయ్యని తమన్ ఈ సినిమాతో తొలిసారిగా ప్రభాస్ కోసం పాటలు కంపోజ్ చెయ్యనున్నారట. ఈ విషయాలన్నిటిపై కూడా అఫీషియల్ క్లారిటీ వస్తే కానీ నిజమని నమ్మలేం.