నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న పవర్ ప్యాక్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "వీరసింహారెడ్డి". ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రకారం, రేపటి నుండి వీరసింహారెడ్డి షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరగనుంది. ఐదు రోజులపాటు అంటే నవంబర్ 13వరకు జరిగే ఈ షెడ్యూల్ లో అనంతపురంలోని పెన్నోబిళం లక్ష్మి నరసింహస్వామి ఆలయం, అమిధ్యాల, రాకెట్ల, ఉరవకొండ, పెనుగొండ కోట లలో వీరసింహారెడ్డి షూటింగ్ జరగబోతుంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.