క్రేజీ హీరోయిన్ సమంత మరో నాల్రోజుల్లోనే "యశోద" గా పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది. ఇటు సౌత్, అటు నార్త్ లోనూ సమంతకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో యశోద సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతేకాక రీసెంట్గా విడుదలైన ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, నెవెర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఎంగేజింగ్ గా ఉండడం వలన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ సినిమా.
నవంబర్ 11న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ ఐన యశోద సినిమా గురించి స్వయంగా సమంత తన అనుభవాలను పంచుకున్న వీడియో ఒకటి కొంచెంసేపటి క్రితమే విడుదలయింది. యశోద గా తన ఎమోషనల్ జర్నీ, యాక్షన్ సీక్వెన్సెస్ లో నటించేటప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు, మరోపక్క హెల్త్ ఇష్యూస్ వీటన్నిటిని బ్యాలన్స్ చేస్తూ యశోద షూటింగ్ లో ఎలా పాల్గొన్నది అనే విషయాలను స్వయంగా సమంత ప్రేక్షకులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో చూసే పనిలో సామ్ ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు.