ఏఆర్ మోహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలక్షన్ డ్యూటీపై గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా నవంబర్ 25న విడుదల కానుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న ప్రత్యేకంగా థియేటర్లలో విడుదల కానుండగా, నవంబర్ 12న డిజిటల్‌గా విడుదల కానుంది. అల్లరి నరేష్ సీరియస్ లుక్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.