ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ చేతుల మీదుగా "అలిపిరికి అల్లంతదూరంలో" మూవీ థియేట్రికల్ ట్రైలర్ రేపు లాంచ్ కాబోతుందని ప్రకంటించిన ఆ మూవీ మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ టైం ను కూడా ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 12:20 నిమిషాలకు అలిపిరికి అల్లంతదూరంలో ట్రైలర్ విడుదల కాబోతుంది.
రావణ్ నిట్టూరు, నిఖిత హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు ఆనంద్ జ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 18న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa