సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 80 మల్టీస్టారర్ సినిమాలు చేశారు. కృష్ణ నటించిన తొలి మల్టీస్టారర్ సినిమా 'ఇద్దరు మొనగాళ్లు'. ఇందులో కాంతారావు మరో హీరో. ఆ తర్వాత వారి కాంబోలో మరో 2 సినిమాలొచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ కలిసి స్త్రీ జన్మ, నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు సినిమాల్లో నటించారు. ఏఎన్నార్ తో కలిసి మంచి కుటుంబం, అక్కాచెల్లెలు, హేమాహేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం సినిమాల్లో కృష్ణ నటించారు. కృష్ణ, కృష్ణంరాజు కలిసి ఎక్కువ సినిమాలు(19) చేశారు. శోభన్ బాబుతో 13, మోహన్ బాబుతో 4, కాంతారావుతో 3, శివాజీ గణేశన్ తో 3, రజనీకాంత్ తో 3, సుమన్ తో 3, నాగార్జునతో 2, బాలకృష్ణ, చిరంజీవి, హరికృష్ణ, రాజశేఖర్, రవితేజలతో ఒక్కో సినిమా చేశారు. కృష్ణ తన కొడుకులు రమేశ్‌బాబుతో 5, మహేశ్‌బాబుతో 7 సినిమాల్లో కలిసి నటించారు.