టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత రీసెంట్గానే "యశోద" గా ప్రేక్షకులను పలకరించి, వారి విశేష అభిమానాన్ని పొందుతుంది. సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకు పాన్ ఇండియా ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రస్తుతం యశోద సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఒకపక్క, మరోపక్క మాయోసైటిస్ నుండి కోలుకుంటూ ఇంట్లోనే ఉంటుంది సమంత.
యశోద మూవీ సక్సెస్ తో సమంత మరొక ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను సమంత బెస్ట్ ఫ్రెండ్, యాక్టర్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ చెయ్యనున్నారట. రాహుల్ చెప్పిన ఒక ఉమెన్ సెంట్రిక్ లైన్ కు సమంత ఎక్జయిట్ గా ఫీల్ అయ్యి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న కమిట్మెంట్స్ పూర్తైన తరవాత రాహుల్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.