సూపర్ స్టార్ కృష్ణగారి ఆరోగ్యం విషమ పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన హనుమాన్ టీజర్ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం నిన్న రాత్రి అధికారిక ప్రకటన వెలువరించింది. హనుమాన్ టీజర్ రిలీజ్ వాయిదా పడడం ఇది రెండోసారి. ముందుగా ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కారణంగా హనుమాన్ టీజర్ రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.
జాంబిరెడ్డి ఫేమ్ డైరెక్టర్ - హీరో ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా కలయికలో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. వాన ఫేమ్ వినోద్ రాయ్ విలన్గా నటిస్తున్నారు.