సూపర్ స్టార్ కృష్ణగారి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న మెగాస్టార్ ట్విట్టర్ లో హృదయ విదాకర నోట్ ను విడుదల చేసారు. కృష్ణ గారి మరణం మాటలకందని విషాదం అని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలివెళ్లడం నమ్మశక్యంగా లేదని, అటువంటి మహామనిషి టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అరుదని, తెలుగు సినీపరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి చిరు అశృనివాళిని సమర్పించారు. కృష్ణగారి మంచి మనసును హిమాలయ పర్వతాలతో పోల్చిన మెగాస్టార్ ఆయన సాహసమే ఊపిరిగా బతికారని, ధైర్యానికి పర్యాయపదమని, ధైర్యం, సాహసం, పట్టుదల, మంచితనం, మానవత్వం.. వీటన్నిటి కలబోతే అని పేర్కొన్నారు. కృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికి, ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.