విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఎఫ్ 2. ఇప్పటి వరకు అపజయం లేని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కావడంతో సంక్రాతికి కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు థియేటర్‌కు క్యూలు కడతారని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. అయితే ఇక్కడ అసలు మ్యాటర ఏంటంటే.. దిల్ రాజుకు ఈ మధ్య వరుసగా ప్లాప్‌లు పడడంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అనుకున్న విధంగానే అన్ని బాగానే కుదిరినా ఒకే ఒక్క విషయం దిల్ రాజు అండ్ ఎఫ్2 టీమ్‌ని కలవర పెడుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ఒక హీరోయిన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాలరాతి సుందరి ఈ మధ్య నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి. తమన్నా నుండి ఈ ఏడాది వచ్చిన నా నువ్వే, నెక్స్ట్ ఏంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఎఫ్ 2 చిత్రం పై అందరూ కాన్ఫిడెన్స్‌గా ఉన్నా.. తమన్నా లెగ్ మహిమ ఈ చిత్రానికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని దిల్ రాజుతో పాటు అనిల్‌కు కూడా టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. మరి తమన్నా ఈ చిత్రానిక లక్కీ అవుతుందో లేక అన్‌లక్కీ అవుతుందో తెలియాలంటే సంక్రాతి వరకు ఆగాల్సిదే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa