సురేష్ సినిమా పతాకంపై సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేష్ దూడల నిర్మించిన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా మలయాళంలో నటించి మంచి విజయం సాధించిన 'ఎలెక్ట్రా' చిత్రాన్ని తెలుగులో 'లేడీ టైగర్' పేరుతొ ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీమతి సరోజ సురేష్ ఈ చిత్రానికి సహ నిర్మాత. ప్రకాష్ రాజ్, మనీష కొయిరాలా, బిజూ మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యాంప్రసాద్ దర్శకుడు.
ఈ చిత్రం ఈనెల 4న విడుదలవుతుండడాన్ని పురస్కరించుకొని సురేష్ సినిమా అధినేత సురేష్ దూడల మాట్లాడుతూ... 'లేడీ సూపర్ స్టార్' నయనతార ఫ్యాన్స్ కి పండగలాంటి సినిమా 'లేడీ టైగర్'. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం హైలైట్ గా నిలుస్తుంది. అలాగే మనీషా కొయిరాలా నటన కూడా. ఈనెల 4న విడుదలవుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది' అని అన్నారు!!
lady tiger movie, heroine nayanatara
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa