ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తికరమైన టైటిల్ తో రాజశేఖర్ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 01, 2019, 06:55 PM

హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు దశావతారాల్లో కల్కి అవతారం ఒకటి. కల్కి అనే ఆసక్తికరమైన టైటిల్ తో రాజశేఖర్ చిత్రం వస్తోంది. అ! లాంటి విభిన్న చిత్రంతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అతడి దర్శత్వంలోనే కల్కి చిత్రం తెరకెక్కుతోంది. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో ఫామ్ లోకి వచ్చాడు. మరోమారు ఉత్కంఠ భరిత కథలో వస్తుండడంతో ఆసక్తి నెలకొంది. నూతన సంవత్సర కానుకగా కల్కి చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. మోషన్ పోస్టర్ డిజైన్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. రాజశేఖర్ జీపుపై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ ఆరంభంలో శ్రీ మహా విష్ణు అవతారాలు అయిన నరసింహ, మోహిని దృశ్యాల్ని చూపించారు. చివర్లో రాజశేఖర్ లుక్ రివీల్ చేశారు.


మోషన్ పోస్టర్ చివర్లో హ్యాపీ న్యూ ఇయర్ 2019 అని పడుతుంది. అది క్రమంగా తగ్గుతూ 1983 వద్ద ఆగుతుంది. దీని ద్వారా దర్శకుడు ఈ చిత్రం గురించి మరో హింట్ ఇచ్చాడు. 1983 నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. మోషన్ పోస్టర్ లో బ్యాగ్ గ్రౌండ్ సంగీతం చాలా బావుంది. ఆదా శర్మ, నందిత శ్వేతా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa