పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'ఎ లవ్, అన్ కండీషనల్' అనే కవితల పుస్తకం రాశారు. దీన్ని ఇంగ్లీషులో రాసిన ఆమె తెలుగులో ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ సహాయంతో అనువాదం చేసి విడుదల చేశారు. బుక్ ప్రమోషన్స్‌లో భాగంగా రేణు దేశాయ్ పలు తెలుగు టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి , పలు అంశాలపై రేణు దేశాయ్ తనదైన శైలిలో స్పందించారు.
పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ దర్శకత్వం, నిర్మాణం, రచనలో తన ప్రతిభ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు చిత్రాలను ఆమె రూపొందించారు. తనకు దర్శకత్వం అంటే చాలా ఇష్టమని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో చేయాలని ఉంది? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ ‘నా సొంత అబ్బాయి ఉన్నాడు కదా' అని రిప్లై ఇచ్చారు.
అకీరా యాక్టింగ్ వైపు వస్తాడా? లేక ఇతర రంగాల వైపు వెళతాడా? అనేది తాను ఇప్పుడే చెప్పలేను. కేవలం 14 సంవత్సరాల పిల్లాడు. చైల్డ్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే అకీరాకు మ్యూజిక్ అంటే ఇష్టం. పియానా వాయిస్తాడు. ప్రతి ఒక్కరూ నన్ను అకీరాను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా? అని అడుగుతున్నారు. వారికి చెప్పేది ఒకటే. ఇప్పటి నుంచి అకీరా బ్రెయిన్లో యాక్టర్ కావాలనే ప్రెషర్ పెట్టడం ఇష్టం లేదని రేణు దేశాయ్ తెలిపారు.
అకీరా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా ఉండాలనే విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు. వాడి రక్తంలోనే అది ఉంది. పవన్ కళ్యాణ్ కొడుకు. చిరంజీవి పెద్దనాన్న. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో అకీరాకు బ్రదర్ అని రేణు దేశాయ్ తెలిపారు. ప్రస్తుతం పిల్లలు వాళ్ల నాన్నతోనే విదేశాలకు క్రిస్మస్ వెకేషన్ వెళ్లారు. ప్రతి ఏడాది 10 రోజులు వారు తప్పకుండా కళ్యాణ్ గారితో వెకేషన్ వెళతారు. వారు ఇప్పుడు ఇండియాలో లేరు... ‘ఎ లవ్, అన్ కండీషనల్' అనే పుస్తకంలోని కవితలు నేను స్వయంగా అనుభవించిన ప్రేమ, సంతోషం, బాధ లాంటి వాటికి ప్రతిరూపం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి సంతోషాన్ని ఇస్తుంది, విడాకులు బాధను ఇస్తుంది. ఇలా ఎన్నో అంశాలు ప్రేమ, సంతోషం, బాధను కలిగిస్తాయని రేణు దేశాయ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa