పల్లవి:
ఎవ్వరినెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమా
యే మదినెప్పుడు మబ్బులలో యెగరెస్తుందో ఈ ప్రేమా
అర్ధం కాని పుస్తకమే అయిన గాని ఈ ప్రేమా
జీవిత పరమార్ధం తానె అనిపిస్తుంది ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
చరణం 1
ఇంతకు ముందర యెందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమా
కలసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా