పొన్‌రామ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన 46వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'డీఎస్పీ' అని టైటిల్ ని ఖరారు చేసారు. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకొని CBFC ద్వారా U/A సర్టిఫికెట్ ని పొందినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ 2న డీఎస్పీ సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందని మూవీ టీమ్ వెల్లడించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన అనుకీర్తి వాస్ జోడిగా నటిస్తుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.