MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇంకా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. తాజాగా ఇప్పుడు సోనీ మ్యాక్స్ ఛానల్ ఈ చిత్రం యొక్క వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను హిందీలో ప్రకటించింది. 'మాచర్ల చునావ్ క్షేత్రం' (MCK) టైటిల్ తో ఈ చిత్రం డిసెంబర్ 11, 2022న రాత్రి 8 గంటలకు ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు ఒక చిన్న ప్రోమోను కూడా విడుదల చేశారు.
ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.