ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్ర‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు యాత్ర

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 02, 2019, 04:18 PM

జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి  పేద‌ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని నేరుగా విన‌టానికి మెద‌లు పెట్ట‌ని పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌న్ని తీసుకుని యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అండ్ డైలాగ్ టీజ‌ర్ల‌తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఇప్పుడు రాజ‌న్నా నిన్నాప‌గ‌ల‌రా అంటూ సాగే రెండ‌వ సింగిల్ తో ఆయ‌న పాద‌య‌త్ర వ‌ల‌న ప్ర‌జ‌ల ఆనందాన్ని చూపించారు.. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నికులు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8న యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌మెష‌న్ యాక్టివిటిని యాత్ర సినిమాకి అనుగుణంగా వైవిధ్యంగా చేయ‌టానికి నిర్మాత‌లు ప్ల‌న్ చేస్తున్నారు. 
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడు శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  పాత్ర‌లో మమ్ము‌ట్టి   న‌టిస్తున్నారు  ఇప్ప‌టికే విడుద‌ల చేసిన యాత్ర మెద‌టి లుక్ కి, టీజ‌ర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి   రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం. 
   లెజెండ‌రి ర‌చ‌యిత శ్రీ సిరివెన్నెల సీతారామ‌శాస్ట్రి   ర‌చించారు. కె సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం యెక్క ప్ర‌మెష‌న‌ల్ ఈవెంట్స్ ఒక్కొక్క‌టి మెమె తెలియ‌జేస్తాము.. ప్ర‌తి తెలుగు వాడికి ఈ సినిమా రీచ్ అయ్యేలా ప్ర‌మెష‌న్ ని ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8 న విడుద‌ల చేస్తున్నాము.. అని అన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa