తాలా అజిత్ నటిస్తున్న సరికొత్త చిత్రం "తునివు". హెచ్ వినోద్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మలయాళ బ్యూటీ మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో తునివు లాస్ట్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఘిబ్రన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఫుల్ మాస్ మసాలా సాంగ్ గా రూపొందించబడిన "చిల్ల చిల్ల" సాంగ్ కు ప్రస్తుత షెడ్యూల్ లో అజిత్ అండ్ టీం స్టెప్స్ వెయ్యనున్నారు. పోతే, ఈ పాటను ప్రముఖ కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఆలపించారు. వైశాగ్ లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa