కొంతసేపటి క్రితమే హిట్ 2 ట్రైలర్ విడుదలయ్యింది. టీజర్ తో చూసే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన హిట్ 2 మూవీ తాజాగా విడుదలైన ట్రైలర్ తో నరాలు తెగిపోయే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కోడి బుర్ర.. అని ఈజీగా కొట్టి పారేసిన ఒక క్రిమినల్ క్రైమ్ స్టోరీ హీరో శేష్ కు ఎంత కఠినమైన సవాలును విసిరిందో ... ఈ ట్రైలర్ లో క్లియర్ గా తెలుస్తుంది. ఇక, ఆ క్రిమినల్ విసిరిన పెను సవాలుకు శేష్ ఎలా సమాధానం చెప్పాడు.. ఆ కోడిబుర్ర క్రిమినల్ ను శేష్ పట్టుకోగలిగాడా.. అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే..డిసెంబర్ 2న విడుదల కాబోయే హిట్ 2 సినిమాను చూడాల్సిందే.
శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. రావురమేష్, కోమలిప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.