ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్‌ను ముగించిన త్రిష తొలి తెలుగు వెబ్ సిరీస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 07:31 PM

సూర్య వనగల దర్శకత్వంలో త్రిష తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కి 'బృందా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు త్రిష తన మొదటి తెలుగు సిరీస్ 'బృందా' షూటింగ్ పూర్తయిందని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా అధికారకంగా ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్ లో త్రిష ఎస్‌ఐ బృందా పాత్రను పోషిస్తోంది.


క్రైమ్ థ్రిల్లర్‌గా ట్రాక్ లో రానున్న ఈ సిరీస్ లో సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా తన సోదరుడు ఆశిష్ కొల్లాతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa