ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసింహా’ని మించి ‘పేట’ హిట్టు కొడుతుంది- అశోక్ వల్లభనేని

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 02, 2019, 10:07 PM

సోగ్గాడే చిన్నినాయనా, నవాబ్, సర్కార్ వంటి చిత్రాల్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసి విజయాలు అందుకున్నారు అశోక్ వల్లభనేని. తమిళ హీరో విజయ్‌కి తెలుగులో మార్కెట్ రేంజు పెంచిన నిర్మాతగా పేరు మార్మోగిపోతోంది. ఆయన రిలీజ్ చేస్తున్నవన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన క్రేజీ సినిమాలే. అగ్ర కథానాయకుల సినిమాల్ని తెలుగులో అనువదించి రిలీజ్ చేసి హిట్లు కొడుతున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వ ం వహించిన పేట (పేట్ట) చిత్రాన్ని సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. అశోక్ వల్లభనేని చెప్పిన ఆసక్తికర సంగతులివి.. 


ఆయన నా స్ఫూర్తి


రజనీకాంత్ ఒక స్ఫూర్తి. ఆయన ఒక బస్ కండక్టర్ గా మొదలై, దక్షిణాదితో పాటు ఆల్ ఇండియా సూపర్‌స్టార్ ఆయన. కాబోయే సీఎం అని కూడా అంటున్నారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఆయన సినిమా తీసుకున్నా. అలాగే రజనీ కాంత్  సేవా గుణం నాకు ఇష్టం. ఆయన తమిళంలోనే కాదు.. తెలుగు వారికి ఏం చేశారు? అనే దానికి నేను కొంత సామాజిక సేవ చేయబోతున్నా. నా సినిమా తరపునుంచి.. నా వైపు నుంచి రజనీ చేతులమీదుగా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా.. అనాధాశ్రమాలు అవసరార్థులకు సాయం చేయబోతున్నా. ఈ నెల 6న జరగబోయే పేట ప్రీ రిలీజ్ వేడుకలో రెండు, మూడు అనాథ శరణాలయాలకు రజనీ చేతుల మీదుగా నగదును చెక్స్ రూపంలో అందించబోతున్నాం. 


రజనీ పాతికేళ్లు వెనక్కి


ఈ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రజనీకి వీర భక్తుడు. హిట్టు కొట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని  అన్నారని విన్నాను. ఆయన అంత కాన్ఫిడెంట్ గా అన్నారంటే ఎంతో నమ్మకంతోనే కదా?  ట్రైలర్‌ను చూస్తే రజనీకాంత్ పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయారనిపించేంత గొప్పగా ఉంది.  రజనీ గత చిత్రాలతో పోల్చితే తర్వాతి లెవల్ లో ఉండే సినిమా ఇది. అలాగే అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. పాటలకు చాలా చక్కని స్ప ందన వచ్చింది. జనవరి 6న హైదరాబాద్ జేఆర్‌సీ సెంటర్ లో పేట ప్రీరిలీజ్ వేడుక చేయనున్నాం. రజనీ సహా టీమ్ హాజరయ్యే అవకాశం ఉంది. 


విజయ్ మార్కెట్ పెరిగింది


మణిరత్నం - నవాబ్, మురుగదాస్- సర్కార్ చిత్రాల్ని నేను రిలీజ్ చేశాను. ఈ చిత్రాలకు ఎవరూ ఇవ్వని ఆఫర్ ఇచ్చి నేను రైట్స్ తీసుకున్నా. విజయ్ సినిమాలు ఇన్ టైమ్ లో రిలీజ్ కాలేదు. సర్కార్ చిత్రాన్ని సాఫీగా రిలీజ్ చేసి, విజయ్ కి మంచి మార్కె ట్ ని క్రియేట్ చేయగలిగానని గర్వ ంగా చెప్పుకోగలిగాను. నా గత చిత్రాలు బాగా రిలీజ్ చేసాను కాబట్టి నాపై నమ్మకంతో సన్ టీవీ వాళ్లు ఏ హక్కులు ఇచ్చినా సగం ధరకే ఇస్తారు. 


పేట అంటే అర్థం


పేట అంటే ఒక ఏరియా.. లేదా ప్రాంతం. చిలకలూరి పేట, నరసారావు పేట తరహాలో ఇదో పేట. ఈ పేటలో రజనీ ఏం చేస్తారో తెరపైనే చూడండి. 


బావుంటే థియేటర్లు పెరుగుతాయి


సంక్రాంతికి తెలుగులో మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. అందువల్ల థియేటర్ల పరంగా పోటీ నెలకొంది. అయినా ఎన్ని తక్కువ థియేటర్లు అయినా సినిమా రిలీజ్ చేస్తాం. ఎంత పోటీ ఉన్నా సంక్రాంతి సినిమాలన్నిటికీ ఆదరణ దక్కుతుందన్న నమ్మకం ఉంది. సినిమా బావుంటే ఆటోమెటిగ్గా థియేటర్లు పెరుగుతాయి. 50శాతం బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. కొన్నిచోట్ల మేమే రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంది. 


నాపై అంత నమ్మకం


పేట హక్కుల్ని ఎవరూ ధైర్యం చేయనంత పెద్ద ధరకు రైట్స్ ను కొనుక్కున్నా. అలాగే నాపై నమ్మకంతో సన్ నెట్ వర్క్ వాళ్లు సగం ధరకే సినిమా హక్కుల్ని ఇస్తున్నారు. హీరో విజయ్ కి ఇక్కడ మార్కెట్ క్రియేటవ్వడంలో నేను చేసిన హార్డ్ వర్క్ సన్ నెట్ వర్క్ వాళ్లకు తెలుసు. సర్కార్ చిత్రం వేరొక నిర్మాత వదులుకున్నా.. మేం తీసుకుని రిలీజ్ చేసి హిట్ కొట్టాం. పేట సినిమాని రిలీజ్ చేస్తున్న ఒక పంపిణీదారు నాతో మాట్లాడుతూ ..  ఫోన్ పెట్టెయ్ .. సినిమా సూపర్‌హిట్టు అన్నారు 


స్ట్రెయిట్ సినిమా చేస్తాను


-తెలుగులో స్ట్రెయిట్ సినిమాను ఈ ఏడాది ప్లాన్ చేస్తున్నాం. కథలు వింటున్నాను. మంచి కథ, హీరో దొరకగానే ప్రకటిస్తాం. చిన్న బడ్జెట్ చిత్రాలు చేయబోతున్నాం. నేను ఏ సినిమా చేసినా చివరి వరకూ ఎఫర్ట్ పెట్టి పని చేస్తాను. విజయం అందుకుంటున్నాను. 


సేవ జీవితంలో భాగం 


నాన్నగారు హైదరాబాద్ లో మరణించారు. ఆయనకు బ్రెయిన్ ట్యూమర్.. ఆ తర్వాత గుండె నొప్పి వచ్చి చనిపోయారు. దానినుంచి రియలైజ్ కావడానికి కొంత సమయం పట్టింది. సేవలో భాగంగా నాన్న గారి రెండు కళ్లను డొనేట్ చేశాం. ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఓ ఇద్దరికి  కళ్లను పెట్టారు. నా వంతుగా నేను రజనీ స్ఫూర్తిగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నా. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa