ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరి ఇలా లేట్ చేస్తే ఎలా

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 03, 2019, 11:36 AM

పూరి జగన్నాధ్ గత కొంతకాలంగా ప్లాప్ లతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే.చివరగా తన కొడుకుతో మెహబూబా మూవీ తీసాడు. అది కాస్త మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే చాల గ్యాప్ తీసుకొని మల్లి ఒక సినిమా ను స్టార్ట్ చేసాడు. ఎనర్జెటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఇస్మార్ట్ శంకర్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఐదిలా ఉంటే ఈ సినిమా గురించి జనవరి 2 వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఓ ప్రకటన ఇస్తామని జనవరి 1 న  ప్రకటించారు.

ఇక జనవరి 2 వ తేదీ ఉదయాన అప్డేట్ ను మిస్ కావొద్దని ఒక రిమైండర్ కూడా ఇచ్చారు.  దీంతో ఉత్సాహం ఉన్న నెటిజనులు 4 గంటల వరకూ వేచి చూస్తే.. "జనవరి 3 వ తేదీ సాయంత్రం 4 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని" మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాపై ఆసక్తిని పెంచేందుకు పూరి అండ్ టీం ఇలాంటి ఇస్మార్ట్ ఐడియా వేసుకున్నారేమోగానీ.. నిజంగా ఏదో ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తారని వేచి చూసిన వారు మాత్రం పూరి టీమ్ పై ఫైర్ అవుతున్నారు.  ఇదేదో డైరెక్ట్ గా ఫస్ట్ లుక్ జనవరి మూడవ తారీఖు న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తామని చెప్తే సరిపోతుంది కదా.. మా టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని మండి పడుతున్నారు.

ఈ ఇస్మార్ట్ ఐడియాలు.. పబ్లిసిటీ జిమ్మిక్కులకంటే కావలిసింది కథలో దమ్ము.. సినిమాలో స్టఫ్ఫు. అవి లేకనే అటు పూరి.. ఇటు రామ్ పరాజయాలతో సతమతమౌతున్నారు. మరి ఈ పబ్లిసిటీ  స్టంట్స్ తో పాటు కంటెంట్ పై కూడా శ్రద్ధ పెడితే బాగుటుందని నెటిజనులు కోరుతున్నారు. వింటున్నారా పూరి సారూ..?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa