జూ. ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య చాల సందర్భాల్లో వీరు కలవడం జరిగింది. ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం రీసెంట్ గా జైపూర్లో జరిగిన సంగతి తెలిసిందే. గ్రాండ్ స్కేల్ లో జరిగిన ఈ వివాహానికి పలువురు టాలీవుడ్ స్టార్లు తమ ఫ్యామిలీలతో హాజరయ్యారు. ఎన్టీఆర్.. చరణ్.. ప్రభాస్.. రానా.. నాని.. నాగార్జున ఇలా చాలా పెద్ద గెస్ట్ లిస్టు ఉంది. #బంగారం సేస్ ఎస్ఎస్ పేరుతో ఇప్పటికే ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా అలాంటిదే మరోఫోటో బయటకు వచ్చింది. చరణ్.. ఎన్టీఆర్ లు ఒకే ఫ్లైట్ లో జైపూర్ కు పయనమై వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఫోటోలో చరణ్.. ఎన్టీఆర్.. అనుష్కలు విమాన సిబ్బంది తో కలిసి విమానంలోనే పోజిచ్చారు. చరణ్.. తారక్ లు మాత్రం పెద్దగా స్మైల్ ఇవ్వకుండా స్టైల్ గా నిలబడ్డారు గానీ స్వీటీ మాత్రం ఫుల్ గా స్మైల్ ఇచ్చింది. రేర్ కాంబినేషన్ కావడంతో ఈ ఫోటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
2018 సంవత్సరానికి గానూ కార్తికేయ-పూజా ప్రసాద్ ల కళ్యాణం టాలీవుడ్ లో ఒక మెమొరబుల్ ఈవెంట్ లాగా మిగిలిపోయింది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ .. వెడ్డింగ్.. పోస్ట్ వెడ్డింగ్ ఫోటోల హంగామా ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa