RRR సినిమా ఇండియాలో అలానే ఓవర్సీస్ లో ఎక్సెలెన్ట్ రిపోర్ట్స్ తో పాటు నిర్మాతలకు భారీ లాభాలను కూడా తెచ్చిపెట్టింది. రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ లో ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, శ్రేయాశరణ్ కీలకపాత్రలు పోషించారు. మార్చి 25న పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన నాల్గవ భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
అక్టోబర్ లో జపాన్ లో విడుదలైన RRR సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. డీసెంట్ గా స్టార్ట్ ఐన కలెక్షన్లు ఇప్పుడు ఆల్ టైం రికార్డును నెలకొల్పే దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో జపాన్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ సినిమాగా ఉన్న బాహుబలి 2 ప్లేస్ ను RRR ఆక్రమించింది. ఇప్పటివరకు RRR జపాన్లో 305 మిలియన్ యెన్ లను సాధించింది. ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ ఇండియన్ ఫిలిం గా పాతికేళ్ళబట్టి ఉన్న రజినీకాంత్ "ముత్తు" రికార్డును RRR బీట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.