ఈ రోజు ఉదయం విడుదలైన వీరసింహారెడ్డి ఫస్ట్ లిరికల్ సాంగ్ కి ప్రేక్షకాభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. 4 మిలియన్ క్యుములేటివ్ వ్యూస్ తో 139 కే లైక్స్ తో యూట్యూబ్ #1 పొజిషన్ లో దూసుకుపోతుంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తుంది ఈ పాట. చూడడానికి గ్రాండ్ విజువల్స్ తో మాంఛి సెలెబ్రేషన్ సాంగ్ గా ఉన్న ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ కమర్షియల్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa