ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ "ఇండియన్ 2" లో మరొక బాలీవుడ్ నటుడు..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 05:29 PM

విశ్వనటుడు కమల్ హాసన్ - డైరెక్టర్ శంకర్ కలయికలో ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పునఃప్రారంభించబడిన నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నెక్స్ట్ మంత్ నుండి న్యూ షెడ్యూల్ స్టార్ట్ చెయ్యనుంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు గుల్షన్ తన ట్విట్టర్ లో కమల్ తో దిగిన పిక్స్ ను పోస్ట్ చేసి, ఐకానిక్ ఇండియన్ 2 లో కమల్ తో కలిసి పని చెయ్యడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసారు.


కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa