ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మట్టికుస్తీ" సెకండ్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 12:41 PM

కోలీవుడ్ డైరెక్టర్ చెల్లా అయ్యావు డైరెక్షన్లో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం "మట్టి కుస్తీ". తమిళంలో "గట్ట కుస్తీ" పేరుతో తెరకెక్కుతుంది. మాస్ రాజా రవితేజ తో కలిసి విష్ణు విశాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


రీసెంట్గానే ఈ సినిమా నుండి చల్ చక్కని చిలక అనే ఫస్ట్ సింగిల్ రిలీజవ్వగా, తాజాగా మేకర్స్ పోకిరోడే అనే సెకండ్ సింగిల్ ను విడుదల చెయ్యడానికి ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరింటికి పోకిరోడే లిరికల్ సాంగ్ విడుదల కాబోతుంది.


క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన పూర్తి స్థాయి కుటుంబ కధా చిత్రమిది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com