నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం "18 పేజెస్". క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు. సుకుమార్ రైటింగ్స్, GA 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఒక పాట పాడబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గోపిసుందర్ స్వరకల్పనలో రూపొందిన ఒక అద్భుతమైన సాంగ్ కోసం శింబు తన గొంతును సవరించుకోబోతున్నారు. మరి, ఈ విషయమై అధికారిక ప్రకటన రావలసి ఉంది.
రీసెంట్గానే రామ్ పోతినేని ది వారియర్ లో బుల్లెట్ బండి సాంగ్ ను శింబు పాడారు. అది చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.