ఈ రోజు సాయంత్రం "పంచతంత్రం" ట్రైలర్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే కదా. తాజా సమాచారం ప్రకారం, పంచతంత్రం ట్రైలర్ ను మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ స్టూడెంట్స్ ఈ రోజు సాయంత్రం 04:05నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాతోనే చాన్నాళ్ల తరవాత బ్రహ్మానందం వెండితెరపై సందడి చెయ్యబోతున్నారు. ఇంకా ఇందులో కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, ఆదర్శ్, ఉత్తేజ్ నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.
హర్ష పులిపాక డైరెక్షన్లో ఆంథోలజి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 9వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.