'ది కాశ్మీర్ ఫైల్స్'ను ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా అని IFFI జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నదవ్ లపిడ్ సోమవారం అన్నారు. గోవాలో జరిగిన IFFI-2022 ముగింపు వేడుకలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మంగళవారం స్పందించారు. ‘నిజం ప్రజలను అబద్ధాలు చెప్పేలా చేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ దీనిని 'ముందస్తు ప్లాన్' అన్నారు. టూల్‌కిట్ గ్యాంగ్ యాక్టివ్‌గా మారి చేసిన పని అని పేర్కొన్నారు.