కార్తికేయ 2 తదుపరి యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "18పేజెస్". ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కథను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారు రచించడం విశేషం.
18 పేజెస్ సెకండ్ లిరికల్ సాంగ్ 'టైమివ్వు పిల్లా' ను కోలీవుడ్ స్టార్ హీరో STR (శింబు) పాడారని అఫీషియల్ గా తెలిపిన మేకర్స్ లేటెస్ట్ గా స్టూడియోలో శింబు ఈ పాట పాడినప్పటి గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసారు. ఇది పక్కా తెలుగు లిరిక్స్ తో ఉన్న సాంగ్ నేను పాడలేను... నా వల్ల కాదు.. అని శింబు అంటే, అందుకు నిఖిల్ ... మీరు ఈ పాట పాడుతున్నారు.. లేకుంటే నేను ఇక్కడే ధర్నా చేస్తాను... అని క్యూట్ గా బదులివ్వడం ... ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. పోతే, ఈ పాట డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa