ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చెప్పాలని ఉంది' గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 07:29 PM

మెగాస్టార్ చిరంజీవి గారితో రీసెంట్గానే 'గాడ్ ఫాదర్' సూపర్ హిట్ మూవీని నిర్మించిన టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "చెప్పాలని ఉంది". ఈ సినిమాతో యష్ పూరి హీరోగా పరిచయం అవుతున్నారు. స్టెఫీ పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది.


తాజాగా చెప్పాలని ఉంది ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం ఒకటిన్నర నుండి JRC కన్వెన్షన్ లో చెప్పాలని ఉంది గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతుంది.


మురళీశర్మ, సునీల్, పృథ్విరాజ్, సత్య, అలీ, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa