అడివిశేష్ హీరోగా నటిస్తున్న 'హిట్ 2' సినిమా నుండి రీసెంట్గానే ఫస్ట్ లిరికల్ 'ఉరికే ఉరికే' సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా మేకర్స్ హిట్ 2 సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేస్తూ, స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు హిట్ 2 థీమ్ సాంగ్ 'పోరాటమే' విడుదల కాబోతుంది.
కొలను శైలేష్ డైరెక్షన్లో, నాచురల్ స్టార్ నాని సమర్పణలో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
పోతే, ఈ మూవీ డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa