డిసెంబర్ 2వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతున్న చిత్రాలలో, కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ నటిస్తున్న "మట్టి కుస్తీ /గట్ట కుస్తీ" ఒకటి. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా, చెల్లా అయ్యావు డైరెక్షన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ 'తన్నే చిన్నది' విడుదలైంది. ఇద్దరు భార్యాభర్తల మధ్య మట్టి కుస్తీ నేపథ్యంలో వచ్చే ఈపాట చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పాటను జస్టిన్ ప్రభాకరన్ స్వరపరచగా, సింగర్ మంగ్లీ పాడారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa