తెలుగు ఇండస్ట్రీలో మహిళా దర్శకురాళ్లు చాలా అరుదు. అమెరికాలో ఉద్యోగానికి తాత్కాలిక విరామమిచ్చి, మీట్ క్యూట్ అనే సిరీస్ ను తెరకెక్కించారు దీప్తి ఘంటా. హీరో నాని అక్కడా ఎంట్రీ ఇచ్చినా, తొలిప్రయత్నంతోనే మంచి దర్శకురాలిగా అభినందనలు అందుకుంటున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, కోవిడ్ టైమ్ లో రిలాక్స్ అవ్వడానికి రాయడం మొదలు పెట్టానని, దాన్ని నానికి చూపిస్తే బాగుందని మెచ్చుకున్నాడని తెలిపింది. అలాగే మరో 5 ఎపిసోడ్లు రాసి నానికి ఇస్తే ఏం చేద్దామని అడిగాడని, ఎవరైనా డైరెక్టర్ ని అడుగుదామనుకున్నారని, కానీ నువ్వయితేనే బాగా డీల్ చేయగలవని, నువ్వే డైరెక్ట్ చేస్తవా అని నాని అడిగాడని తెలిపింది. అలా నాని అడగడంతో దర్శకురాలిగా మారానని, తమ్ముడి స్పూర్తితోనే దర్శకురాలిగా మారానని ఆమె తెలిపింది.