సౌత్ మరియు బాలీవుడ్ నటి రాశీ ఖన్నా ఈరోజు తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించారు. ఈ సందర్భంగా తన జన్మదిన వేడుకలను మొక్కలు నాటారు. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. డెబ్యుతోనే హిట్ కొట్టిన రాశి, అక్కడి నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ‘ఊహలు గుసగుస లాడే’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన వాళ్లు రాశి ఖన్నాకి బాగానే కనెక్ట్ అయ్యారు. ఇంతకన్నా ముందు అక్కినేని త్రయం నటించిన ‘మనం’ సినిమాలో కాసేపు కనిపించింది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉన్న రాశి ఆ తర్వాత స్లిమ్ అయ్యి తన యాక్టింగ్ స్కిల్స్ కి గ్లామర్ ని కూడా తోడయ్యేలా చేసింది.1990 నవంబర్ 30న పుట్టిన రాశి ఖన్నా నేటితో ముప్పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా ఆమెకి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Beautiful #raashikhanna
.
.#rashikhanna #rashikanna #raashikanna #actress #Bollywood #bollywoodactress #tollywoodactress #Rmedia #Rmediaoff pic.twitter.com/y9fbbsgLgE
— Rmedia (@RMediaOff) October 22, 2022