పాన్ ఇండియా సెన్సేషన్ "పుష్ప" డిసెంబర్ 8వ తేదీన రష్యాలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు నిన్ననే రష్యన్ భాషలో పుష్ప థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలయ్యింది.
ఈ తరుణంలో చిత్రబృందం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. రష్యాలో ప్రమోషన్స్ చేసేందుకు బయలుదేరివెళ్లారు. రష్యాలో పుష్ప టీం కు సిబ్బంది బొకే ఇచ్చి ఆహ్వానిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
పోతే, డిసెంబర్ 1, 3 తారీఖుల్లో మాస్కో, పీటర్స్బర్గ్ నగరాలలో ప్రదర్శితమయ్యే పుష్ప ప్రీమియర్స్ కు చిత్రబృందం హాజరుకానుంది.