నాని నిర్మాతంగా, శైలేశ్ కొలను దర్శకత్వంలో హిట్ 2 సినిమా డిసెంబర్ 2 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు శైలేస్ మాట్లాడుతూ హిట్ 2 లో నానినే హీరో గా చేయమన్నానని, కానీ ఆయన నిర్మాతగానే ఉంటానని అన్నాడని తెలిపారు. నాని హీరోగా ఒక సినిమా చేయాలని ఉందని, తప్పకుండా చేస్తానని తెలిపారు. ఆల్రెడీ నేను తయారు చేసిన కథలు నా దగ్గర రెడీగా ఉన్నాయి. తరువాత సినిమా ఎవరితో ఉంటుంది అనేది డిసెంబర్ 2 తరువాత చెబుతాను. ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిన రెండు మూడు వారాలకు హిందీలో డబ్ చేయడం జరుగుతుంది అని తెలిపారు.