కోలీవుడ్ సెన్సేషన్ "లవ్ టుడే" తెలుగు డబ్బింగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది కోలీవుడ్ హీరోయిన్ ఇవానా. ఆమె నాచురల్ యాక్టింగ్ మరియు అందంతో యూత్ లో మంచి పాపులారిటీని తెచ్చుకుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఇవానా ఒక డైరెక్ట్ తెలుగు సినిమాలో లీడ్ హీరోయిన్ గా నటించబోతుంది. అదికూడా టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే ప్రాజెక్ట్ లో. ఇంతకూ విషయమేంటంటే, లవ్ టుడే ను తెలుగులో రిలీజ్ చేసిన దిల్ రాజు గారు తన నెఫ్యూ ఆశిష్ రెడ్డి తో 'సెల్ఫిష్' అనే మూవీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా ఇవానా ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ మేరకు అధికారిక క్లారిటీ రాబోతుంది.
కాశీ విశాల్ రెడ్డి డైరెక్షన్లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.