మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన "బ్రూస్ లీ" సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హలో చెప్పారు కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్. రీసెంట్గానే ఆయన నటించిన "ఏనుగు" రిలీజై డీసెంట్ హిట్ అయ్యింది. ఆయన నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "ఆక్రోశం".
GNR కుమారవేలన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మూవీ స్లైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై CH సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ కుమార్ సమర్పిస్తున్నారు. తమిళంలో 'సినం' గా విడుదల కాబోతున్న ఈ మూవీని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సాబీర్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఆక్రోశం మూవీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ న్యూ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు డిసెంబర్ 9న ఆక్రోశం మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.