టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండపై ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 11 గంటల పాటు విజయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లైగర్ సినిమా ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ చేపట్టింది. ఈడీ విచారణ అనంతరం హీరో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలొస్తాయి అని ఇది వాటిలో ఒకటి అని తెలిపారు. జీవితంలో ఇదొక అనుభవమని,ఈడీ అధికారులకు తాను పూర్తిగా సహకరించానని విజయ్ తెలిపాడు.