టాలీవుడ్ యంగ్ హీరో కం డైరెక్టర్ విశ్వక్ సేన్ కీరోల్ లో నటించిన చిత్రం "ముఖచిత్రం". చాన్నాళ్ల నుండి సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాబోతుందని రీసెంట్గానే బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు రేపు ఉదయం పదకొండింటికి విడుదల తేదీతో కూడిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది.
ఈ చిత్రానికి గంగాధర్ డైరెక్టర్ కాగా, స్టోరీ- స్క్రీన్ ప్లే - డైలాగ్స్ నేషనల్ అవార్డు విన్నర్ 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ అందించారు. కాలభైరవ సంగీతం అందించారు. ప్రదీప్ అంగిరేకుల, మోహన్ ఎల్లా నిర్మించారు. వివేక్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యా రావు, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు.