అందాల రాశీఖన్నా పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా రాశి మొక్కలను నాటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గా సర్దార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాశి ప్రస్తుతం 'యోధ' అనే హిందీ సినిమాలో సిద్దార్ధ్ మల్హోత్రా తో నటిస్తుంది. 'మనం' సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ తో టాలీవుడ్ కి హాయ్ చెప్పిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆపై ఊహలు గుసగుసలాడే సినిమాతో లీడ్ హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తిష్ట వేసుకుని కూర్చున్న రాశి ఆపై బెంగాల్ టైగర్, సుప్రీమ్, జైలవకుశ, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాలలో నటించింది.