తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న చిత్రం "వారిసు". ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఔటండౌట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, ప్రభు, సంగీత, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
వచ్చే సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి రిలీజ్ డేట్ కు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చెయ్యలేదు. ఐతే, జవనరి 12, 2023న తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతుంది. మరైతే, ఈ విషయంలో మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.