మెగాహీరో అప్ కమింగ్ మూవీ టీజర్ ను లాంచ్ చేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు రంగంలోకి దిగబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ డిసెంబర్ 7వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా జరగనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. టైటిల్ కూడా అప్పుడే రివీల్ కాబోతుందట.మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంతకూ ఆ మెగా హీరో ఎవరు? ఏ సినిమా? అంటే....
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకున్న తదుపరి SDT 15 లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. గతకొంతకాలంగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి అతి త్వరలోనే టీజర్ రిలీజ్ అప్డేట్ రాబోతుందట. ఈ మూవీ టీజర్ లాంచ్ కోసం టీం తారక్ ను అప్రోచ్ అయ్యారని టాక్.
పోతే, ఈ సినిమాకు కార్తీక్ దండు డైరెక్టర్ కాగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందిస్తున్నారు.